

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 4
ఐఎన్ఎఈ యువ అసోసియేట్‌గా డాక్టర్ బాలస్వామి వేల్పుల ఎంపిక
ఐఎన్ఎఈ యువ ఇంజనీర్ అవార్డు 2025 అందుకున్న ఘనత
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి), బెంగుళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామానికి చెందిన డాక్టర్ బాలస్వామి వేల్పుల 2025 సంవత్సరానికి ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ యువ అసోసియేట్‌గా ఎంపికయ్యారు. ఇంజనీరింగ్ మరియు సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన అసాధారణ కృషికి, మరియు భారతదేశంలో విజ్ఞానం మరియు పరిశోధనలను ముందుకు తీసుకెళ్లే అభిప్రాయానికి ఇది అద్దం పడుతుంది. డాక్టర్ బాలస్వామి ఐఎన్ఎఈ యువ ఇంజనీర్ అవార్డు- 2025ను కూడా అందుకున్నారు. దేశవ్యాప్తంగా 30 మంది ప్రతిభావంతులైన యువ ఇంజనీర్లకు అందించే ఈ గౌరవాన్ని ఆయన అందుకోవడం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అవార్డు కింద రూ.25వేలు నగదు బహుమతి మరియు ఒక అధికారిక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఐఎన్ఎఈ యువ అసోసియేట్‌గా ఎంపికైన బాలస్వామి 45 ఏళ్ల వయస్సు వరకు అకాడమీ ఫెలోషిప్ యొక్క పలు ప్రత్యేక అధికారాలు (ఓటింగ్ హక్కులు మినహా) లభించనున్నాయి. ఆయన యొక్క ప్రొఫెషనల్ విజయాలు మరియు వివరాలు ఐఎన్ఎఈ ఈ-ఇయర్ బుక్ 2026లో ప్రచురించబడతాయి. అదేవిధంగా అకాడమీ నిర్వహించే సదస్సులు, వర్క్‌షాప్‌లు, రౌండ్ టేబుల్ చర్చలు మరియు పరిశోధన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారు. ఐఎన్ఎఈ వార్షిక సమ్మేళనం 2025 సందర్భంగా విడుదలయ్యే అవార్డు బుక్లెట్‌లో బాలస్వామి ముఖ్యమైన ఇంజనీరింగ్ సాధనలను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. తద్వారా ఆయన కృషి మరింత విస్తృత శాస్త్రీయ మరియు ఇంజనీరింగ్ సమాజానికి పరిచయం కానుంది. బాలస్వామికి అరుదైన గౌరవం లభించడం పట్ల పలువురు ప్రముఖులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు