

జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
నిత్యవసర వస్తువులు ఇకపై మరింత తక్కువ ధరకే ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా జిఎస్టి పనుల హేతుబద్ధీకరణ చేస్తామని ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎర్రకోట నుండి ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన కీలక ప్రకటనని సాకారం చేయబోవటం ఎంతో ఆనందాయకమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. ఈ జీఎస్టీ పనుల హేతుబద్ధీకరణ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలు అనునిత్యం ఇంట్లో వాడే వస్తువులు ఇకపై మరింత తక్కువకి అందుబాటులోకి రావడం ద్వారా వాళ్ల కుటుంబంలో ఆర్థికంగా గణనీయమైన లబ్బి కొందరున్నారని ఈ మార్పు ఈనెల 22వ తారీకు నుండి అమలులోకి రానుందని చెప్పారు. అమెరికా వంటి వివిధ దేశాల్లో ప్రస్తుతం ద్రవ్యాలు బలం అత్యంత ఎక్కువగా ఉండి వస్తు రేట్లు పెరిగిపోయి ప్రజలు నిలదీస్తున్న తరుణంలో భారతదేశం ద్రవయోల్బణం అత్యల్పంగా ఉండటమే కాక మోదీ గారు తీసుకున్న ఈ జిఎస్టి హేతుబద్ధీకరణ నిర్ణయం ద్వారా వస్తువులు మరింత చౌకగా దేశ ప్రజలకి అందుబాటులోకి రానున్నాయని ఇది ప్రధాని మోడీ నాయకత్వ పటిమకి నిదర్శనమని కొని ఆడారు. కొత్త పన్ను విధానంలో విద్యార్థులు అధికంగా వాడే నోటు పుస్తకాలు వివిధ సామాగ్రి పై ఇకపై సుంకమే ఉండదని చెప్పారు. రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందని వారు వ్యవసాయానికి వాడే వివిధ పరికరాల ధరలు ఇకపై గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ద్విచక్రాల వాహనాల ధరలు ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు తగ్గనున్నాయని దేశ ప్రజలకి దీపావళి కనుకగా ప్రధాని మోడీ గారు ఈ మార్పులను సెప్టెంబర్ 22 తారీకు నుంచి అమలు చేయనున్నారని తెలియజేస్తూ ప్రధాని మోడీ కి కృతజ్ఞతలు దేశ ప్రజలకి అభినందనలు శుభాకాంక్షలు రవికిరణ్ తెలియజేశారు.