

జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
భారత ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జిఎస్టి గురించి ప్రకటించిన విధంగా సంస్కరణ వల్ల పేదలకు మధ్య తరగతి వర్గాలకు భారీ స్థాయిలో నిత్యవసర వస్తువులు తగ్గుదల భారీగా ఉంటుందని, జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయడం ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు అభినందనీయమని మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్లు లో రెండు స్లాబ్లు మాత్రమే పరిమితం చేశారని, 12 శాతం లో ఉన్న 5 శాతానికి కుదించారని 28% ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించడం వల్ల రాష్ట్రంలో కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వానికి పన్నులు రావడం జరుగుతుందని ఇది అన్ని వర్గాలకు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మంచి జరుగుతుందని నాగ జగదీష్ ఆశాభావం వ్యక్తపరిచారు. జీఎస్టీ మార్పులతో చాలా వరకు నిత్యవసర వస్తువులు ధరలు తగ్గనున్నయని, ఇప్పటివరకు ఐదు శాతం పన్ను రేట్లలో ఉన్న టెట్రా పాలు, పన్నీరు, రొట్టెలపై పన్ను పూర్తిగా మినహాయించారని, ఇప్పటివరకు 18 శాతం 12 శాతం పన్ను రేట్లలో ఉండి ఇకపై ఐదు శాతం పన్ను రేటులోకి వస్తున్న హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్ లు, సైకిల్, టేబుల్లు, కుర్చీలు, న్యూడిల్స్, కాఫీ, కార్న పెక్స్, బట్టర్, నెయ్యి, హస్త కళాకృతులు, మార్బుల్, గ్రానైట్, కొన్ని రకాల ఔషధాలు, డయాగ్నిక్ కిట్లు, కళ్లద్దాలు, సోలార్ ప్యానల్ ధరలు తగ్గనున్నాయని నాగ జగదీష్ అన్నారు. అదే విధంగా నిత్యవసర వస్తువు అయిన పెట్రోల్ డీజిల్ సిఎన్జి వాహనాలు వాటి వీడి భాగాలపై జీఎస్టీ తగ్గింపుతో కార్లతో పాటు, ఆటోలు, బస్సులు, ట్రక్కులు ధరలు దిగివస్తాయని నాగ జగదీష్ అన్నారు. ఇప్పటివరకు బాధలో అనుభవించిన సామాన్య ప్రజలకు ఇకపై వస్తు ధరల్లో జీఎస్టీ తగ్గడం వల్ల అతి పేద వాళ్ళకి కూడా ధరలు అందుబాటులో ఉంటాయని, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాంకు, ఎన్డీఏ భాగస్వామపక్షాలకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు నాగ జగదీష్ తెలియజేశారు.