Listen to this article

పాపన్నపేట.సెప్టెంబర్:03 (జనంన్యూస్)

.ఫోటో ఎక్స్ పోను ప్రతి ఫోటోగ్రాఫర్ వినియోగించుకోవాలని . ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు నర్సా గౌడ్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు… బుధవారం నాడు మండల కేంద్రమైన పాపన్నపేటలో వన దుర్గ భవాని స్టూడియోలో స్థానిక ఎస్. ఐ శ్రీనివాస్ గౌడ్ . కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి నిటలాక్షప్ప, చేతుల మీదుగా హైదరాబాద్ ఫోటో ఎక్స్పో వాల్ పోస్టరు ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి ఫోటోగ్రాఫర్ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి హైదరాబాదులో సెప్టెంబర్ 19, 20 ,21 తేదీలలో టెక్నాలజీకి సంబంధించిన ట్రైనింగ్ తో పాటు అధునాతన టెక్నాలజీకి సంబంధించిన వివిధ కెమెరాలు పై డెమో ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ దేవిదాస్, మాజీ మండల కో ఆప్షన్ గౌస్, నాయకులు దుర్గేష్ ప్రవీణ్ తోపాటు ఫోటోగ్రాఫర్లు ఉమామహేశ్వర్ దాసరిశ్రీకాంత్. రాము తదితరులు పాల్గొన్నారు.