

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న
బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని శివ సాయి నగర్ కాలనీలో శివ సాయి గణేష్ మండపం లో యువజన కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి దంపతులతో కలిసి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం గణపతి మండపం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాతలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో ప్రజలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అన్నదాతలు మాట్లాడుతూ వినాయకుడు గ్రామ ప్రజలందరిపై ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించమని, గణనాథుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంలో ఉండాలని సేవ భావం ప్రతి ఒక్కరిలో కలగాలని అన్నదాతలు గణపతిని వేడుకున్నారు. అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ఎంతో అనుభూతిని పొందామని అన్నదాతలు తెలియజేశారు.
