

జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిబ్బందితో కలిసి అన్నసమారాధనలో పాల్గొని, స్వయంగా వడ్డించడం ద్వారా సిబ్బందిలో సాన్నిహిత్యం పెంపొందించారు.ఈ సందర్భంగా ఏవో సి.హెచ్.తిలక్ బాబు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేసి పూజలో పాల్గొనడం, సిబ్బందికోసం అన్నసమారాధన ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావులు, ఏ.ఆర్ డిఎస్పీ పి.నాగేశ్వరరావు, ఏవో శ్రీ సి.హెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్ లక్ష్మణమూర్తి, బాల సూర్యరావు, లక్ష్మి, రమేష్, మన్మధరావు ఎస్.బి., డీసీఆర్బీ, పోలీస్ కంట్రోల్ రూం, ఐటీ కోర్ టీం సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సూపరింటెండెంట్లు ప్రతాప్ శేషయ్య, గిరి, కార్యాలయ యూనియన్ ప్రెసిడెంట్ అప్పలరాజు మరియు ఇతర పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.//
