

జనం న్యూస్ సెప్టెంబర్ 04 నడిగూడెం
వినాయకుడి నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఊరేగింపు సమయంలో డీజేలకు అనుమతి లేదని నడిగూడెం ఎస్సై జి.అజయ్ కుమార్ గురువారం ఒక పత్రిక ప్రకటనలో స్పష్టం చేశారు.నిబంధనలను అతిక్రమించి డీజేలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.నిమజ్జన సమయంలో చెరువులు, వాగుల వద్దకు చిన్నపిల్లలను తీసుకుపోరాదని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మండల ప్రజలు శాంతి భద్రతలను కాపాడుతూ సాంప్రదాయ బద్ధంగా ఉత్సవాలను నిర్వహించాలని ఎస్సై సూచించారు.