

జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేసి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ ఏఐటీయూసీ అధ్యక్షులు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. ప్రీ బస్సు రద్దు చేయాలని సామాన్య ఆటో డ్రైవర్ చింత కాయల శ్రీను చేస్తున్న పాద యాత్ర గురువారం 3రోజుకు కొప్పాక బిడ్జి చేరికుంది వీరికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు మద్దతు తెలిపి అక్కడ నుంచి 4రోడ్లు వరకు పాద యాత్ర నిర్వహించి అనంతరం జరిగిన సమావేశం లో ఫెడ రేషన్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి లు పెదరెడ్ల నాగేశ్వరరావు, కోరిబిల్లి జగదీష్ మాట్లాడుతూ ప్రీ బస్సు వల్ల ఉపాధి లేక తీవ్రంగా నష్ట పోయిన ఆటో కార్మికులు ను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాని లేకుంటే ఆకలి చావులు తప్పవు అని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న చింత కాయల శ్రీను మాట్లాడుతూ ఈ నెల 2 విశాఖ లో బయలు దేరిన పాదయాత్ర ఈ నెల 20వ తేదికి అమరావతి చేరుతుంది అని అమరావతి లో ప్రీ బస్సు రద్దు చేయాలని ఏపీ సీ ఎం, & డిప్యూటీ సీ ఎం కు వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది అని తెలిపారు.అలాగేతనకు ఆటో కార్మికులు మద్దతు ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి సూరిశెట్టి బాబు నాయుడు, కోరిబిల్లి రామ అప్పారావు, ఆటో కార్మికులు గండి బోయిన దివాకర్, పెంట కోట రాము, వెంకటేష్, సైదులు, రాజేష్, రామారావు హరీష్ తదితరులు పాల్గొన్నారు.//