Listen to this article

జనం న్యూస్ :4 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రోజు సిద్దిపేటలోని బ్రహ్మా కుమారీస్ వారు ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను సాధారంగా ఆహ్వానించి సన్మానించు కోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో కవి, గాయకుడు, సాహిత్య వేత,అనంతసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు కోణం పరశురాములు గారు, తెలంగాణ సాహిత్య కళా పీఠం సిద్దిపేట అధ్యక్షులు, కవయిత్రి, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ తెలుగు ఉపాధ్యాయురాలు దాసరి శాంతకుమారి, డాక్టరేట్ పొందిన మిమిక్రీ కళాకారుడు ఎలిగేటి రమేష్ 24వ వార్డు అంగన్వాడీ టీచర్ శైలజ పాల్గొని వారి విశేష ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. తాము టీచర్లమే కానీ నిత్యం నేర్చుకుంటూ విద్యార్థులకు నేర్పే వాళ్ళము, విద్యార్థుల యొక్క భవిష్యత్తుని బాగు చేసే వారిమి, స్వయం కొవ్వొత్తిలా కరిగిపోతూ విద్యార్థుల జీవితాలకు వెలుగునీస్తూ వాళ్లని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే వాళ్ళము, తల్లిదండ్రుల తర్వాత వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉంటుందని వక్తలు తెలియజేశారు, అనంతరం సంస్థ నిర్వాహకురాలు బి కే. భవాని మాట్లాడుతూ సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది ముఖ్యపాత్ర ఉంటుందని, పిల్లలలో ఉత్తమమైన సంస్కారాలను తయారు చేయడము, క్రమశిక్షణ, నడవడికను నేర్పించి, గొప్ప వ్యక్తులుగా మార్చి భారతదేశ నవనిర్మాణంలో పాటుపడే విధంగా తయారుచేసే సామర్థ్యము, శక్తి ఉపాధ్యాయుల్లోనే ఉంటుందని, ఈ తరం పిల్లలకు ఆధ్యాత్మిక బోధన కూడా అందించి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను బాల్యం నుండే నేర్పించాలని, భవిష్యత్తు తరాల వారు విలువలతో కూడిన సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించగలిగే నవ సమాజాన్ని తయారు చేసే ఈశ్వరీయ కార్యంలో ఉపాధ్యాయులు సదా ముందు ఉండాలి అని తెలియజేశారు, అనంతరం శాలువా, పూల మాలలతో సత్కరించి ఈశ్వరీయ కానుకను, ప్రసాదాన్ని అందివ్వడం జరిగింది, మరియు మమ్మల్ని మా సేవలను గుర్తించి బ్రహ్మకుమారీస్ వారు ఆహ్వానించి సన్మానించినందుకు వక్తలు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు మరియు సంస్థ సభ్యులందరూ కలిసి సంస్థ నిర్వాహకురాలు రాజయోగిని బి కే భవాని సన్మానించుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బికే. స్వప్న, బి కే. స్రవంతి ,ఓంకార్, అమరేందర్ రెడ్డి, బాలు, ఉదయ్, విమల తదితరులు పాల్గొన్నారు.