Listen to this article

జనం న్యూస్ : 4 సెప్టెంబర్ గురువారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ :

సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీవాణి స్కూల్ లో టీచర్స్ డే వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. భారతదేశ ద్వితీయ రాష్ట్రపతి, మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహించారు. ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడు, తత్త్వవేత్త, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిన మేధావి అని ఉపాధ్యాయుని ,ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకున్నారు.అనంతరం పాఠశాల స్కూల్ డైరెక్టర్ సి.హెచ్ సత్యం మాట్లాడుతూ “ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి వారికి ఉంది. ప్రతి గురువు ఒక దీపస్తంభంలా విద్యార్థుల జీవితాలను వెలుగులో నింపుతారు” అని అన్నారు.తరువాత విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల పట్ల విద్యార్థుల గౌరవం, కృతజ్ఞత భావం స్పష్టంగా కనిపించింది. గురువుల గొప్పతనాన్ని చాటుతూ ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ సత్యం ,ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.