

జనం న్యూస్ – సెప్టెంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లోని స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గురువులందరినీ విద్యార్థులు సన్మానించారు, స్కూల్ ప్రిన్సిపాల్ ఏ శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే అరుదైన గౌరవం గురువులకే దక్కుతుందని అన్నారు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే అధిక సమయం గడిపిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అని ఎదుటి వారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతున్న గాని బాగా నమ్మిన వ్యక్తి అని ఆయనను కొనియాడారు, విద్యాబుద్ధులు నేర్పి మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమని, ప్రయోజకులమై ఉన్నత స్థానాలు అధిరోహించడమే అసలైన గురుదక్షిణ అని అన్నారు. కరస్పాండెంట్ నకులరావు మాట్లాడుతూ పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే పురుడుపోసుకుంటుందని, ఉపాధ్యాయులు సైతం సర్వేపల్లి ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఏ శివకుమార్, కరస్పాండెంట్ నకులరావు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.