Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో గురువారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహా నివేదన, బలిహరన, తీర్థ ప్రసాద గోష్టి, సంభావన, పవిత్ర వితరణ తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా వెళ్లి భక్తులను ఆశీర్వదించారు ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు దిలీప్ ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.