Listen to this article

ప్రతి రైతు నానో స్ప్రే యూరియా వాడాలి

సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి

జనం న్యూస్ సెప్టెంబర్-04

యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో స్ప్రే యూరియా వాడాలని స్ప్రే యూరియా వలన దిగుబడి ఎక్కువగా ఉంటదని సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి అన్నారు. గురువారం రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో నానో స్ప్రే యూరియా పై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి పాల్గొని మాట్లాడుతూ.. నానో యూరియా వాడడం వలన వాతావరణ,నీటి,నేల కాలుష్యం తగ్గుతుందని ఈ స్ప్రే ఆకుల మీద పడటం వలన వెంటనే దాని రిజల్ట్ తో పాటు పొలం వేపుగా ఎదిగిద్దని అన్నారు. యూరియా వేయడం వలన నేల కాలుష్యము అవుతుందని అలాగే యూరియా మొక్కకు మొక్కకు మధ్యలో పడటం వలన అది ఉపయోగం లేకుండా పోతుందని అన్నారు. ఈ స్ప్రే అన్ని వ్యవసాయ సహకార సంఘాలలో లభిస్తున్నాయని రైతులు ఈ స్ప్రేను వాడి వాతావరణ, నీటి,నేల కాలుష్యాన్ని నివారించడంలో భాగస్వాములు కావాలని అన్నారు.అనంతరం మగినం రాజు పొలంలో టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏవో రజని, పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస రెడ్డి, ఏఈఓ నగేష్, మాజీ కౌన్సిలర్ సామినేని నరేష్, కనగాల శ్రీధర్, స్వామినేని వెంకటేశ్వర్లు, కనగాల కొండయ్య,మందరపు నాగేశ్వరరావు, కనగాల పుల్లయ్య,మాతంగి ప్రసాద్, బొల్లు రామకృష్ణ, గోపాల్, లోకేష్, సతీష్, నగేష్, తదితర రైతులు పాల్గొన్నారు.