Listen to this article

ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్..

జనం న్యూస్// జనవరి 28// జమ్మికుంట // కుమార్ యాదవ్..
మామునూరు వద్ద జరిగిన అతి పెద్ద రోడ్డు ప్రమాద ఘటనలో క్షతగాత్రులైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ధర్మసమాజ్ పార్టీ హుజురాబాద్ మండల ప్రధాన కార్యదర్శి మంద రాజు డిమాండ్ చేశారు.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి భూపాల్ లో గరీబ్ నగర్ కు చెందిన నువ్వు ఊరు సంతోష్ చౌహాన్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని భారీ వాహనాలకు అధికలోడు వేసుకునేందుకు అనుమతి ఇవ్వద్దని రోడ్డు ప్రమాద సూచిక బోర్డులను కచ్చితంగా ఏర్పాటు చేయాలని అన్నారు. డ్రైవర్లకు నెలకు ఒకసారైనా రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు లాంటివి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒకే రోజు ఒకే ప్లేస్ లో రెండు మూడు యాక్సిడెంట్లు అవడం వల్ల కుటుంబ సభ్యులు రోడ్డున పడే పరిస్థితి ఉన్నందున రోడ్డుపై జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు వెంటనే స్పందించి డేంజరస్ ప్లేసులలో స్పీడ్ బ్రేకర్లు వేయించాలని కోరారు.