Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

వ్యవసాయ మార్కెట్ కార్యవర్గం చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం తొలి సమావేశం ఛైర్మన్ షేక్ కరిముల్లా అధ్యక్షతన గురువారం ఉదయం పాత మార్కెట్ యార్డు యందు ఉన్న సమావేశ మందిరంలో జరిగింది. సమావేశానికి గౌరవ సభ్యులు, మున్సిపల్ ఛైర్మన్ షేక్ రఫానీ, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, యార్డు కార్యదర్శి రాయుడు మరియు డైరెక్టర్లు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాలపై పాలకవర్గం చర్చించడం జరిగింది.నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఈ క్రాప్ నమోదు పూర్తి స్థాయిలో జరిగేట్లు రైతులను చైతన్యవంతం చేయాలని,అలాగే క్షేత్ర స్థాయిలో అధికారులు కూడా ఈ క్రాప్ నమోదు విషయంలో పూర్తి స్థాయిలో రైతులకు సహకారం అందించాలని కోరారు. అలాగే గ్రామాలలో వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్లే పలు డొంక రోడ్లను అభివృధి చేయాలని, వాటికి సంబంధించిన వివరాలను డైరెక్టర్లు అందజేయాలని కోరారు. అలాగే పాత,కొత్త యార్డులలో ఉన్న గోదాములను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని పాలక వర్గం నిర్ణయించడం జరిగింది. గత ysrcp ప్రభుత్వ హయాంలో రైతులను యార్డు పాలక వర్గాలు గాలికి వదిలేశారని, నాటి తప్పులను సరి చేసి, రైతులకు యార్డు ద్వారా అందే ప్రతి ప్రయోజనాన్ని పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుని మాజీ మంత్రి వర్యులు, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిష్ఠను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పాలకవర్గం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యార్డ్ డైరెక్టర్లు అనంత వీర కుమారి, గుదే అంజలి, కూరపాటి నాగ మల్లేశ్వరి, చెన్నంశెట్టి పద్మావతి,పల్లపు సుమలత, మందా దుర్గ భవని, నెల్లూరి శాంతి ప్రియ, జష్టి రవి, షేక్ అబ్దుల్ నబీ, కాటూరి శ్రీనివాసరావు, పోపురి హనుమంతరావు, అముదాల లీలా కిషోర్, మొగిలి వేంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.