

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట: సమాజ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన, సేవా తత్పురాలు మదర్ థెరిస్సా వర్ధంతికి పట్టణంలోని స్థానిక రైతు బజార్ ఎదురుగా ఉన్నటువంటి మదర్ థెరిస్సా విగ్రహనికి నాయకులు ఘన నివాళులర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ కాంపౌండర్స్ నర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విజయ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సతీష్ చంద్ర పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎంతోమంది రోగులను తన అక్కున చేర్చుకొని వారికోసం పరితపించిన మదర్ థెరిస్సాకు నివాళులర్పించడం చాలా సంతోషదాయకమని, దేశం కానీ మన దేశం వచ్చి ప్రజలకు తన సేవలను అందించారాని, అటువంటి మహనీయురాలు స్ఫూర్తితో ముందుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ రోజుల్లో సమాజం కోసం చాలా తక్కువ మంది కృషి చేస్తున్నారని, ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మిత్ర సర్వీస్ సొసైటీ ఉపాధ్యక్షులు బి. శ్రీనునాయక్. ప్రధాన కార్యదర్శి దేవరకొండ నాగేశ్వరావు, కోశాధికారి గుంజి బాలసుబ్రమణ్యం ,ఏ శ్రీనివాసరావు, వడ్డాని చిన్నబాబు ,బిసి నాయకులు వీరేంద్ర రాచపూడి వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.