Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా విద్యాశాఖ ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు శాయంపేట మండల కేంద్రము నుండి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.ఈ అవార్డు పొందిన వారిలో జిహెచ్ఎం గ్రేడ్ రెండు కేటగిరిలో అల్లం మాధవి జీ హెచ్ ఎం నేరేడుపల్లి ,శేఖర్ బాబు ఎస్ ఎ ఇంగ్లీష్ శాయంపేట జెడ్ పి హెచ్ ఎస్ బాలిక పాఠశాల నుండి,ఎస్ ఉదయశ్రీ ఎస్ ఏ తెలుగు జడ్.పి.హెచ్.ఎస్ శాయంపేట బాలుర ,చల్ల అశోక్ ఎల్ ఎఫ్ హెచ్ఎం ఎంపిపిఎస్ శాయంపేట జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. అనంతరం అవార్డు తీసుకున్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ వారి ఎంపికకు సహకరించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ , జిల్లా విద్యాశాఖ అధికారికి, మండల విద్యాధికారికి , మండలంలోని వివిధ ఉపాధ్యాయిని ఉపాధ్యాయ మిత్రులకు సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముందు ముందు ప్రభుత్వ విద్యారంగ పటిష్టతకు మరింత ఉత్సాహంతో పనిచేస్తూ హనుమకొండ జిల్లాలోని శాయంపేట మండల కేంద్రంలోని విద్యా శాఖకు మంచి పేరు తెస్తామని తెలియజేశారు…