

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు దర్గా నుండి అరవపల్లి దర్గా వరకు భారీగా ర్యాలీ ప్రదర్శన
నందలూరు మండలంలో ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నందలూరు మండలంలో సయ్యద్ మగ్దుమ్షా ఖాదర్ వల్లి దర్గా పీఠాధిపతులు కాజా సయ్యద్ షా మొహమ్మద్ మోయుద్దిన్ హుసేని ఖాద్రి. ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా నందలూరు దర్గా నుండి అరవపల్లి దర్గా వరకు భారీగా అల్లాహు అక్బర్ అనే నినాదాలతో ఇస్లామిక్ జెండాలు పట్టుకొని భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బీవీ రమణ మరియు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, నందలూరు సర్పంచ్ మోడపొతు ల రాము పాల్గొన్నారు,దర్గా కమిటీ శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు,అరవపల్లి హజరత్ ఖాదర్ షావలి దర్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గా ఆవరణంలో ఏర్పాటుచేసిన అన్నదాన విత్తరణ కార్యక్రమంలో భక్తులకు అతిధులు స్వయంగా వడ్డించారు,ఈ కార్యక్రమంలో సయ్యద్ అమీర్, కమల్ భాష,పఠాన్ కరీముల్లా ఖాన్,షేక్ మౌలా,పఠాన్ మెహర్ ఖాన్,సయ్యద్ అఫ్జల్,ఆకుల చలపతి,సయ్యద్ ఇబ్దాల్,తాటి సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు,
