Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం గత ప్రభుత్వంలో వరి వేస్తే.. ఉరే… అన్న బీఆర్ఎస్ నాయకులు నేడు రైతు సమస్యలపై మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ మండల నాయకులతో కలిసి బుచ్చిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ. అంతర్జాతీయ సమస్యలు, నానో యూరియా వాడకం కోసం యూరియా కొరత ఏర్పడిందని తెలిపారు. కానీ రాజకీయ లబ్ధి పొందడం కోసం రైతులను అడ్డుపెట్టుకోవడం సమంజసం కాదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కి హితవు పలికారు. తాలు,తేమ పేరుతో దోచుకోవడంతో పాటు రైతులపై అక్రమ కేసులు పెట్టించిన హీన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే అని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో శాయంపేట పిఎసిఎస్ లో లక్షల్లో జరిగిన అవినీతి జరిగిందని అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి కి నిజంగా రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే అవినీతి సొమ్మును రికవరీ చేయించి చిత్తశుద్ధి చాటుకోవాలని సవాల్ విసిరారు. ధర్నా పేరుతో డ్రామాలు చేసి, ఇష్టాను రీతిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గత సీజన్ లో మండలంలో వెయ్యి టన్నుల యూరియా పంపిణీ చేస్తే ఈ సీజన్లో ఇప్పటికే సుమారు 13 వందల టన్నుల యూరియా పంపిణీ జరిగిందని చెప్పారు. రైతులు యూరియా బస్తాలు నిల్వ చేయడం వల్ల చిన్న, సన్నకారు రైతులకు బస్తాల కొరత ఏర్పడుతుందని, నిల్వ చేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేసి ,సన్నవడ్లకు బోనస్ ఇచ్చిందని గుర్తు చేశారు. తమ ఉనికిని చాటుకోవడానికి టిఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చల్లా చక్రపాణి మారేపల్లి రవీందర్ చిందం రవి వైనాల కుమారస్వామి నిమ్మల రమేష్ అబ్బు ప్రకాష్ రెడ్డి శానం కుమారస్వామి రాజకుమార్ రాజు మార్కండేయ శంకర్ రమేష్ చంద్రయ్య బాసని రవి భాస్కర్ శంకరాచారి కటయ్య సాదు నాగరాజు రాము కుమారస్వామి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు……