

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని నల్లబండ బజారులో వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. సోమవారం ఓ వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో ఆ వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో తిరుగుతున్న ప్రజలపై కుక్కలు దాడి చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వీధి కుక్కల భారీ నుంచి కాపాడాలని అధికారులను కోరుతున్నారు.