

జనంన్యూస్. 06.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలంలో ఈరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల వివరాలు విడుదల.అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 8 సాయంత్రం 5 గంటలు వరకు. ఎంపీడీవో మనోహర్ రెడ్డికి.మండల పరిషత్ కార్యాలయం మరియు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితాలు మరియు పోలింగ్ స్టేషన్ల వివరాలు పబ్లికేషన్ చేయబడ్డాయి.ఎంపీటీసీ ఓటర్ల జాబితా లేదా పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లపై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే, అవి తప్పనిసరిగా సెప్టెంబర్ 8, 2025 సాయంత్రం 5 గంటలలోపు మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మనోహర్ రెడ్డి. తెలిపారు.