

జనం న్యూస్ – సెప్టెంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని క్రాంతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 23వ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీ కాన్వెంట్ లైన్ లో ఏర్పాటుచేసిన 23వ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాగర్ సి ఐ శ్రీను నాయక్ హాజరై అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో క్రాంతి యువజన సేవా సంఘం అధ్యక్షులు శివ ఉపాధ్యక్షులు నిమ్స్ శివ, కోశాధికారి వెంకట్, సత్యనారాయణ, సాయి, నిఖిల్, వార్డెన్ సాయి, శివ నాగులు, భరద్వాజ్, సైదులు, హేమంత్, పవన్, జీవన్, శీను మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.