Listen to this article

పార్వతీపురం జనం న్యూస్ (రిపోర్టర్ ప్రభాకర్):

పార్వతీపురం పట్టణం జగన్నాధ పురానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, వర్తక కళాసీ సంఘం నాయకులు గేదెల సర్వేశ్వరరావు ఇటీవల ప్రమాదంలో గాయపడి కాలుకు గాయమైంది. ఆయన బైపాస్ రోడ్డులో గల శ్రీ సౌజన్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శనివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సర్వేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యులు నాని డాక్టర్ను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సర్వేశ్వరరావు వేగంగా కోలుకునే విధంగా వైద్య చికిత్స అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే తో పాటు టిడిపి నాయకులు, తదితరులు ఉన్నారు.