Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శనివారం తన నివాసంలో లబ్ధిదారులకు అందచేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్యసేవల కోసం తగినంత ఆర్థిక సహాయం అందించాలని పలువురు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియచేశారు. వారి వినతులు పరిశీలించిన ప్రభుత్వం తాజాగా వారికి ఆర్థిక సహాయం అందిస్తూ చెక్కులు మంజూరుచేసింది. 45 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.24.76లక్షల విలువైన చెక్కుల్ని ప్రత్తిపాటి స్వయంగా అనారోగ్య బాధితులకు, వారి కుటుంబసభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, రూరల్ మండలం అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమలా రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు తుపాకుల అప్పారావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ హోదాలలో నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.