Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని పెద్ద కొడపాక గ్రామంలోని శ్రీవేద పాఠశాలలో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు తమ గురువులకు దుస్తులు బహుకరించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంస్కృత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.పాఠశాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బ్యాడ్జీలు అలంకరించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రియాంక, కీర్తి రెడ్డి, వేద, సౌందర్యతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…..