

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ప్రజాధనంతో అప్పటి సీఎం జగన్ నిర్మించిన మెడికల్ కళాశాలలను కార్పోరేట్ దాహానికి తాకట్టు పెట్టడం ఏంటి అని జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. జనహితమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఉండాలన్న దృష్టితో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాహసోపేత నిర్ణయంతో ఒకేసారి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఇందులో ఇప్పటికే 7 కళాశాలలకు ఎంసీఐ అనుమతులు లభించగా, మిగిలిన 10 కళాశాలలలో పులివెందుల తదితర కళాశాలలకు ఎం సి ఐ అనుమతులు ఇస్తే కూటమి ప్రభుత్వం స్వయంగా వాటిని తోసిపుచ్చి, ఆ సదవకాశాన్ని నియోగించుకోకుండా వద్దు అని చెప్పి లేఖ రాసి, ప్రయివేటు పరం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం వెనుక వాణిజ్యపు లాభం, కమిషన్ల కోరిక తప్ప ప్రజలపై బాధ్యత అనే భావన లేదని దుయ్య బట్టారు.ఒక మెడికల్ కళాశాల నుంచి రూ 500 కోట్ల నుంచి రూ 1000 కోట్ల వరకు కమీషన్లు తీసుకునే టటువంటి ప్రక్రియలో భాగంగానే డబ్బు ఆశతోనే ప్రయివేట్ పరం చేయడం దుర్మార్గమన్నారు.వేలాది పేద విద్యార్థుల ఆశలపై నీళ్లు ఊరించడమేనన్నారు.
వైద్యం కోసం, వైద్య విద్య కోసం ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని మార్చు కోకపోతే.ప్రజలే మార్చే పరిస్థితి వస్తుందని పల్లె గ్రీష్మంత్ రెడ్డి హెచ్చరించారు.