Listen to this article

డీజే సౌండ్ నిషేధంపై తన మార్క్ చూపించిన ఎస్సై ముత్తయ్య

జనం న్యూస్ – సెప్టెంబర్ 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ శోభాయాత్ర డిజె సౌండ్ లు లేకుండా ప్రశాంత వాతావరణంలో డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా ముగిసింది. నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై ముత్తయ్య డీజే నిషేధంపై తన మార్క్ చూపించారు. ప్రతి సంవత్సరం గణేష్ కమిటీ నిర్వాహకులు తమ రాజకీయ పార్టీల పలుకుబడితో చివరి నిమిషంలో డీజే పర్మిషన్లు తెచ్చుకొని శోభయాత్ర నిర్వహించేవారు. కానీ ఈసారి ఎటువంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగమని పీస్ కమిటీ సమావేశంలోనే తమదైన శైలిలో టౌన్ ఎస్ఐ ముత్తయ్య నిర్వాహకులకు తెలియజేశారు. డీజే పర్మిషన్ లేకపోవడంతో నిర్వాహకులు డప్పు వాయిద్యాలతోనే గణనాధుని శోభయాత్ర నిర్వహించారు. డీజే సౌండ్ లు లేకుండానే రెండు కాలనీలలోని గణేష్ విగ్రహాల శోభాయాత్ర ప్రశాంతంగా ముగియటంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ ముత్తయ్య తన సిబ్బందితో శోభయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.