

జనం న్యూస్ సెప్టెంబర్ 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం మునగాల మండలం ఆకు పాముల గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న కార్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనదారుడు అక్కడికి అక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.