

జనం న్యూస్ సెప్టెంబర్ 7 నడిగూడెం
మండలంలోని అన్ని గ్రామాల్లో గణేశుడి నవరాత్రుల అనంతరం శనివారం నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిసాయని ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. పోలీస్ శాఖ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం కలగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారని అభినందించారు.