

జనం న్యూస్ – సెప్టెంబర్ 7- నాగార్జునసాగర్ టౌన్ –
భారతీయ హిందూ సంస్కృతికి ప్రతీక అయిన ఆడవారి నుదుటున బొట్టు ను పెట్టుకొని స్కూల్ కి రావద్దు అంటూ నాగార్జునసాగర్ పరిధిలో పేరుగాంచిన ఒక ప్రైవేట్ పాఠశాల హెచ్ఎం ప్రవర్తిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. విద్యార్థులు తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆ పాఠశాల హెచ్ఎం ప్రవర్తిస్తున్నారు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న హెచ్ఎం తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పిల్లల మనోభావాలను దెబ్బతీస్తూ మానసికంగా ఒత్తిడికి గురయ్యే మాటలతో పిల్లలని ఇబ్బంది పెడుతున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల హెచ్ఎం ఒంటెద్దు పోకడలతో పాఠశాల ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చిన పాఠశాలగా పేరు గాంచిన ఈ పాఠశాలలో ఇటువంటి సంఘటనలు జరగటం దురదృష్టకరం. ఆది నుంచి హెచ్ఎం తీరు వివాదాస్పదమే, ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఎయిడెడ్ స్కూల్ గా ఉన్న ఈ పాఠశాలలో ఫీజులు వసూళ్లు, సంవత్సరంలో రెండుసార్లు విద్యార్థుల యూనిఫామ్ మార్పు, మిడ్ డే మిల్స్ లో అవకతవకలు, స్టేట్ సిలబస్ బోధించాల్సి ఉన్న టెస్ట్ బుక్స్ మార్పు, స్కూల్లో కనిపించని ఎయిడెడ్ టీచర్లు. హెచ్ఎం ఏకచత్రాధిపత్యం నిర్ణయాలతో విసుకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాధికారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై విచారణ చేస్తామని మండల విద్యాధికారి హామీ ఇచ్చినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.