Listen to this article

జనంన్యూస్. 07. నిజామాబాదు. ప్రతినిధి.

నిజామాబాదు.జెండా జాతర సందర్బంగా జెండా బాలాజీ ఆలయంలో నిర్వహించిన జాతర కార్యక్రమంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు జెండా బాలాజీ జాతర ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర ఉందన్నారు, ఇందూర్ జిల్లా ప్రజలు ఇందూర్ తిరుపతిగా జెండా గుడిని కొలువడం ఇక్కడ విశేషం అన్నారు.గోల్ హనుమాన్ వద్ద గల జెండా బాలాజీ మందిరంలో వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి చివరి రోజు జెండాకు పూజలు చేసి అక్కడి నుండి పులాంగ్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి జాతరను ఘనంగా నిర్వహించడం అనవయితీగా వస్తుందని అన్నారు.కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇందూర్ జిల్లా మరింత అభివృద్ధి చెందాలని, జిల్లా ప్రజలందరు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మినారాయణ,ఇప్పకాయల కిషోర్, ఇల్లేందుల ప్రభాకర్, ఎంసాని రవీందర్, గుండ సతీష్,ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.