

జనం న్యూస్ సెప్టెంబర్ 7 నడిగూడెం
మండల పరిధిలోని రత్నవరం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కర్ష కృష్ణవేణి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకిత భావం, ఉత్తమ పాఠ్య బోధన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణవేణి ఎంపికపై పలు ఉపాధ్యాయ సంఘాలు, తోటి ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.ఈనెల 9న సూర్యాపేటలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు మండల విద్యాధికారి బి. ఉపేందర్ రావు పేర్కొన్నారు.