

జనం న్యూస్ సెప్టెంబర్ 8 చిలుకూరు(మండల ప్రతినిధి ఐనుద్దీన్) మండలంలోని జెర్రీపోతులగూడెం గ్రామంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిపిఐ పార్టీలో చేరారు, చేరిన వారిలో విజయ్, సైదులు,నాగరాజు,చంటి,రమేష్ ఉన్నారు వీరిని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు సిపిఐ గ్రామ నాయకులు నారాయణ చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో జాయిన్ అయ్యామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ సీనియర్ నాయకులు కోటయ్య వెంకటయ్య లక్ష్మయ్య మహేష్ రెమిడీల రాజు జావిద్ తదితరులు పాల్గొన్నారు