Listen to this article

(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 09)

సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం, పరిధిలోని సొసైటీ కి యూరియా వస్తుంది అని సోమవారం రోజున AO సాయికిరణ్ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి పెడుతున్నడుని స్థానిక రైతులు వాపోయారు ప్రొద్దున ఆరు గంటలకు వచ్చి లైన్లో నిలబడి తిండి తికాన లేకుండా ఒక యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నారు సగం లోడు సొసైటీ కి రావలసినప్పటికీ సొసైటికి రాకుండా గోవిందా పూర్ లో పూర్తిగా దింపి రైతులకు ఇబ్బంది కలగజేశాడు అని రైతులు తెలిపారు అంతేకాకుండా సోమవారం రోజున వచ్చిన రైతులకు పాస్ బుక్ కి ఒకటి చెప్పు నా యూరియా రాసి ఇచ్చినారు మంగళవారం రోజున యూరియా వస్తుందని తప్పుడు సమాచారం ఇచ్చారు మళ్లీ యధావిధిగా రైతులందరూ సొసైటీ దగ్గర పడిగాపులు కాశారు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం సరైన సమాధానం చెప్పకపోవడం రైతుల ముందుకొచ్చి సమాధానం చెప్పలేని పరిస్థితి మంగళవారం రోజ AO సాయికిరణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు సకాలంలో రైతులకు సహకరించకుండా నిర్లక్ష్యం గా వ్యవహరించిన ఏవో సాయికిరణ్ ను సస్పెండ్ చేసి కొత్త అధికారులను నియమించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు.