Listen to this article

సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు సినీతారలు హాజరై సందడి చేశారు. స్టాండప్‌ కమెడియన్‌ నక్కీ గ్లేజర్‌   వ్యాఖ్యతగా వ్యవహరించి నవ్వులు పూయించారు. ఈ అవార్డుల్లో పాయల్‌ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ ( All We Imagine as Light) రెండు విభాగాల్లో పోటీ పడింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం రెండు కేటగిరీల్లోను దానికి అవార్డు రాకపోవడంతో సినీ ప్రియులు నిరాశకు గురయ్యారు. గత నెలలో ఈ అవార్డుల నామినేషన్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

వాటిల్లో ‘ఎమిలియా పెరెజ్‌’(Emilia Pérez) ఏకంగా 10 నామినేషన్లు దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఉత్తమ చిత్రంతో సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది.