

జనం న్యూస్ 11 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.
వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలో ఏమైనా కేసులు ఉంటే ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చనుగోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై భారత్ కుమార్ రెడ్డి తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు కోర్టుల చుట్టూ తిరిగే బదులు, ఇరువర్గాలు రాజీకి వస్తే ప్రయోజనం ఉంటుందని ఆయనఅన్నారు. న్యాయ వ్యవస్థ ఆధ్వర్యంలో కేసులను రాజీ పద్ధతిలో పరిష్కరించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై ప్రజలకు సూచించారు.