Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 11 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దళిత రణ బేరి ని జయప్రదం చేయండి

BSP పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు

బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 24న విజయవాడలో జరిగే దళిత రణభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కోరారు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఏకమై దళితులపై నిరంతరం దాడులు దళిత స్త్రీలను మానభంగాలు చేయటం హత్యలు చేస్తున్నారని దీనిని నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బంధుల గౌతం కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి వందల ఐదు మంది కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా సీనియర్ నాయకులు వేల్పుల రాంబాబు మరో సీనియర్ నాయకులు జాన్సన్ బివిఎఫ్ నాయకులు బూదాల సామేలు షేక్ కాజా షేక్ జిలాని జాను ప్రసాద్ రావు మరియు బిఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు