

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
పాపన్నపేట, సెప్టెంబర్ 10 (జనంన్యూస్)
గత పాలకులు మాయ మాటలతో ప్రజలను మోసం చేశారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు విమర్శించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాల వారీగా మంజూరైన 66 కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఏడుపాయలకు అభివృద్ధి కీ నిధులు కేటాయిస్తామని అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. అభివృద్ధి కోసం మీ అందరి తరపున కష్టపడి పనిచేసే బాధ్యత తనదన్నారు. తహశీల్దార్ సతీష్ కుమార్,ఎంపీడీఓ విష్ణువర్ధన్,పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్,నాయకులు ప్రభాకర్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి,గౌస్ పాషా,ఆకులశ్రీనివాస్,నరేందర్ గౌడ్,ఖలీమ్,భరత్ గౌడ్,కుమ్మరి విట్టల్ తదితరులు ఉన్నారు .
