

జనం న్యూస్,కోహెడ మండలం, సెప్టెంబర్ 11,
కోహెడ మండలంలోనీ సి సి పల్లి,నుండి మైసంపల్లి వరకు వయా కాచాపుర్ రోడ్ పైన 57,లక్షల తో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కాచాపూర్ గ్రామస్తుల, కోరిక మేరకు వేరే రోడ్ పైన బ్రిడ్జి నిర్మాణానికి ఇంజనీర్ అధికారులు ప్రపోజల్ తయారు చేసి.ఎస్టిమేట్ వేశారు అన్ని అతి త్వరలో శంకుస్థాపన, చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అలాగే మహిళా సంఘాలకు అందజేసిన స్టీల్ సామాగ్రిని వాడాలని. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి. కాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.హైమావతి, ఆర్డీఓ రామ్మూర్తి, ఏసిపి సదానందం, అధికారులు మండల నాయకులు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.