

జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండలం కేశనకుర్రు పాలెం క్షత్రియ కళ్యాణ మండపంలో సమరసత సేవా ఫౌండేషన్ గ్రామ ధార్మిక సమితి సత్సంగ నిర్వహణలో విశిష్ట అతిథిగా విచ్చేసిన అఖిలభారత ధర్మజాదరణ సహప్రముఖ్మాన్యశ్రీ ఏలే శ్యామ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ధార్మిక జట్లు బలోపేతం ద్వారా ధర్మ పరిరక్షణ చేయగలుగుతామన్నారు ఎస్ ఎస్ ఎఫ్ పిలుపునిచ్చిన ఏకాదశి నగర సంకీర్తన, వారం వారం భజన, సత్సంగము, పౌర్ణమి సామూహిక హారతి. ద్వారా గ్రామంలో ధార్మిక చైతన్యంతో పాటు గ్రామ వికాసం సాధ్యపడుతుంది అన్నారు హిందూ ధర్మ విశిష్టతను కథల ద్వారా వివరిస్తూ సనాతన ధర్మం సజీవంగా ఉన్నంతకాలం ప్రపంచం ఉండగలుగుతుంది. అందరూ బాగుండాలని కోరుకునే ధర్మం హిందూ ధర్మం మతమార్పిడి జరిగితే దేశం ముక్కలవుతుంది హిందువుల మీద దాడులు హిందూ ఆస్తులు దోచుకోవడం జరుగుతుంది లవ్ జిహాద్ ప్రమాదాల నుండి యువతను కాపాడుకోవాలని హెచ్చరించారు. వీరితోపాటు సమరసత సేవా ఫౌండేషన్ ప్రాంత పెద్దలు కొండారెడ్డి ముద్దు సాయిరాం తులసి సూర్యప్రకాష్ టి పి వి జగన్నాధ్ బండ్ల రామశంకర్ వాకాడ శ్రీనివాసరావు కుక్కల ధర్మారావు గాదిరాజు విశ్వనాథరాజు చింతా వివేక్ గోలకోటి వెంకటరెడ్డి పెన్మెత్స గోపాలకృష్ణమరాజు పిన్నమరాజు గణపతిరాజు నిమ్మితి కాంతకుమారి చిక్కం శ్రీనివాసరావు గాదిరాజు శ్రీనివాసరాజు లు పాల్గొన్నారు ఈ కార్యక్రమమునకు సహకరించిన దాతలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ గ్రామాల గ్రామ కన్వీనర్లకు కార్యకర్తలకు హిందూ బంధువులకు ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేశారు.
