

జనం న్యూస్;11 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్;
కాళోజి జయంతి తెలంగాణ భాషా దినోత్సవం సందర్బంగా యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో యువ కవి వేల్పుల రాజు యాదవ్ కు కవి కిరీటి బిరుదును ప్రధానం చేశారు. సిద్దిపేటలోని తులిప్స్ స్కూల్, భారత్ నగర్ నందు జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు చింతల బాల్ నర్సయ్య యాదవ్ మాట్లాడుతూ కష్టసాగరం నుండే కలం కదులుతుందని, కాళోజి జీవితం ఆదర్శమన్నారు. సమాజ మేలు కొరకు రచనలు చేయాలన్నారు. బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ యాస, బాసలతో రచనలు జనుల గుండెల్లో నిలువాలన్నారు. కవి కిరీటి వేల్పుల రాజుయాదవ్ మాట్లాడుతూ సాహిత్యం సంతోషాన్ని పంచుతానని, రచయితలకు సామాజిక చైతన్యం ఉంటుందన్నారు. కవి కిరీటి బిరుదు నా సాహిత్యానికి వన్నె తెస్తుందన్నారు. యాదవ సొసైటీ అధ్యక్షులు బైరి అనీల్ కుమార్, యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షులు గొర్రె మల్లికార్జున్, కవి బైతి దుర్గయ్య, సందేబోయిన రాజు, తలారి చంద్రశేఖర్, గుండెల్లి సత్యలక్ష్మి, దాసరి రాజు, కాల్వ రాజయ్య, జక్కుల రాజేశం, అక్కెం ఐలయ్య, బత్తుల రాములు, బైరు సత్తయ్య, బొద్దుల బాల్ నర్సయ్య, దారబోయిన రాజు, జక్కుల సురేష్, చింతకాయల శ్రీహరి, పోర్ల మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.