

జనం న్యూస్;11 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
కలం ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చిన ప్రజాకవి కాళోజి బాటలో రచయితలు సాగాలని జాసాప అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, మిట్టపల్లి పర్శరాములు లు అన్నారు. కాళోజి జయంతి తెలంగాణ భాషా దినోత్సవం సందర్బంగా సిద్దిపేటలో చిత్రపటానికి పూలమాలవేసి వారు మాట్లాడుతూ సమాజ చైతన్యానికి అనేక కోణాలలో రచనలు చేసి సమసమాజ స్థాపన కొరకు పాటుపడిన వ్యక్తి కాళోజి అని అన్నారు. నా గొడవ రచనతో ప్రతి ఒక్కరిని మెల్కోల్పిన గొప్ప రచయిత కాళోజి అని అన్నారు.