Listen to this article

పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డుల పరిశీలన

ప్రతి ధరఖాస్తును ఆన్లైన్ లో నమోదు చేయాలి.

డైల్ 100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలి..

ఆస్థి సంబంధిత నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేయాలి..

ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ ఆప్స్ మోసాల గురించి, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

నేరాల నియంత్రణ, నేర చేదనలో ఉపయోగపడే సిసికెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి:ఎస్ పి పరితోష్ పంకజ్

జనం న్యూస్ సెప్టెంబర్ 11

అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్ పి పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ ను పరిశీలించారు. అనంతరం అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ.., లాంగ్ పెండింగ్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని సూచించారు. అధిక ఆస్థి సంబంధిత నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లు గా గుర్తించి నిఘా కట్టుదిట్టం చేయాలని అన్నారు.అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. సిబ్బంది ప్రతిఒక్కరూ అన్ని వర్టికల్ విభాగాలలో ప్రావీణ్యత కలిగి ఉండాలని, ఎవరికి కేటాయించిన పనిని వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడే వర్టికల్ విభాగంలో ముందుకు వెళ్లగళం అని అన్నారు. సిటిజన్స్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారికి కనిపించే విధంగా ఉంచాలని అన్నారు. అదేవిధంగా పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని వారిసమస్యను ఓపికగా విని సత్వర న్యాయానికి కృషి చేయాలని సూచించడం జరిగింది. యువత అత్యాశతో ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ.. సైబర్ మోసగాళ్ళు పన్నిన వలలో చిక్కి డబ్బుతో పాటు తనువు చాలిస్తున్నారని, సైబర్ నేరాలు జిల్లాలో అధికంగా పటాన్ చేరు, అమీన్పూర్ ప్రాంతాలలో జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలో మరియు సోషల్ మీడియా ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించడం జరిగింది.ముఖ్యంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఉద్యోగుల తాకిడి, స్కూల్స్, కళాశాల బస్సుల వలన అధిక ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని, దీనిని అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించడం జరిగింది.నేరాల నియంత్రణలో, జరిగిన నేరాలను చేదించడానికి కీలకంగా ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ స్వచ్ఛందంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకొనే విధంగా చూడాలని అన్నారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ , షాప్స్, పెట్రోల్ పంపులు లలో సిసి కెమెరాల ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్ చేరు డి ఎస్ పి ప్రభాకర్, అమీన్పూర్ సీఐ నరేష్, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.