

జనం న్యూస్ సెప్టెంబర్ 11 నడిగూడెం
రైతులకు సరిపడా యూరియా వచ్చేంత వరకు మా పోరాటం ఆగదని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు.గురువారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నడిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రం ముందు జరిగిన ధర్నాను ఉద్దేశించి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి వరి నాట్లు పెట్టుకున్న రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయకలేక పోవడంతో పొలాల్లో ఉండాల్సిన రైతులు రైతు సహకార కేంద్రాల వద్ద రోజుల తరబడి ఉదయం, పగలు,రాత్రీ పడిగాపులు కాస్తున్న ఒక్క బస్తా యూరియా దొరకకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని. ఈ పాపానికి కారకులు ఎవరని రైతులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం కూడా ముందుకు సాగదని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముందు చూపు లేక పోవడంతో ప్రయివేట్ నానో కంపెనీలకు లొంగిపోవడం వల్ల డిమాండ్ ఆధారంగా 72 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల యూరియాను 62 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా వరకే ఇండెంట్ పెట్టడం 10 లక్షల కోట్ల ఇండెంట్ తగ్గించటం రైతుల పట్ల చూపిస్తున్న సవతితల్లి ప్రేమే మాత్రమేనని రైతుని వ్యవసాయం నుండి దూరం చేయడమేనని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగాలకు అప్ప చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు బిజెపి మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియాను తెప్పించడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు.చిన్న సన్న కారు దళిత, గిరిజన రైతులు బయట కొనలేక ఇప్పటికే ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసి వరి సాగు చేస్తే ఒక్క యూరియా బస్తా కొరకు రాత్రి నుండి సాయంత్రం వరకు రైతులు రోడ్ల మీదకు రావల్సిన పరిస్థితి దాపురించిందనీ, ప్రైవేట్ డీలర్లకి యూరియా ఇచ్చి 500 రూపాయలకు కి అమ్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డీలర్ల వద్ద కూడా రెండు వందల రూపాయలకు అమ్మియాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోయినా ప్రైవేటు డీలర్ల వద్ద 200 రూపాయలకి అమ్మకపోయినా రైతుల తరుపున ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ ధర్నాలో మల్లెల వెంకన్న సిఐటియు మండల కన్వీనర్ రైతు సంఘం నాయకులు రేఖ తిరపయ్య, సంపత్ పిచ్చయ్య, కృష్ణయ్య, సుధాకర్ రెడ్డి, వెలుగోరి పాండు, వెంకన్న, వెంకట్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీను, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.