

జనంన్యూస్. 11.సిరికొండ.ప్రతినిధి.
సిరికొండ మండల కేంద్రం నుండి 9 కిలోమీటర్ల దూరంలో గల దట్టమైన అడవిలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ పర్వత వర్ధిని సహిత లొంక రామలింగేశ్వర స్వామి ఆలయ మహా క్షేత్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం దర్శించుకున్నారు. మొదటగా పుష్కరిలో స్నానం ఆచరించి సైకత లింగానికి లింగాష్టకం చదివి వినిపించారు. అనంతరం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అలాగే ఆలయ క్షేత్రం పరిసరాలను అన్నిటిని పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ..
దట్టమైన అడవిలో రెండు కొండల మధ్యలో వెలిసిన ఆలయ క్షేత్రం చాలా ప్రసిద్ధి ఉందన్నారు. పచ్చని చెట్లు, నీటి సెలయేళ్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సిపి గారిని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ధర్పల్లి సీఐ బిక్షపతి, ఆలయ పండితుడు దండాల నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు అవధూత గంగాధర్, దాసరి మారుతి, పారి పెళ్లి రాజ్ కుమార్, కంచెట్టి లక్ష్మీనారాయణ, బాడాల సంతోష్ పారిపల్లి బీనీల్, అంగూరి గణేష్ గౌడ్, సైరి ప్రశాంత్ సిరికొండ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.