Listen to this article

జనం న్యూస్,సెప్టెంబర్11,అచ్యుతాపురం: మండలం లోగల

పూడిమడక పంచాయతీ పల్లిపేట గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమైనట్టు ఆమె తల్లి గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అచ్యుతాపురం సెజ్ పరిధిలో గల బ్రాండిక్స్ కంపెనీలో విధులు ముగించుకుని పూడిమడకలో తన నివాసం వద్దకు చేరుకుందని, అనంతరం రాత్రి ఒంటి గంటన్నర సమయంలో ఇంటి వద్ద నుండి వెళ్లిపోవడం జరిగిందని,ఇప్పటి వరకు తిరిగి ఇంటికి చేరలేదని ఆ ఫిర్యాదులో ఆమె తల్లి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక సీఐ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.