Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం
: ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న సుమారు 257 మంది తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి మరియు యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ బిజెపి జాతి నాయకులు సోము వీర్రాజు పేర్కొన్నారు అల్లర్ల గురించి సమాచారం అందిన వెంటనే తన అనంతపురం పర్యటన రద్దు చేసుకొని హుటాహుటిన రాష్ట్ర సచివాలయానికి చేరుకొని ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం అక్కడ ఉండి పరిస్థితిని సమీక్షించి అధికారులతో సమన్వయం చేసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి తెలుగువారు సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చడంలో లోకేష్ చేసినటువంటి కృషి కచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు.