

జనం న్యూస్ సెప్టెంబర్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన 20 మంది ఉపాధ్యాయులను గురువారం ఘనంగా సన్మానించినట్లు, ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుల సంఘాల సహకారం అభినందనీయమన్నారు. సన్మాన గ్రహీతలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు భరత్ బాబు,సైదయ్య గౌడ్,మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా, గెజిటెడ్ హెడ్మాస్టర్ దీపా దేవి, ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం వినోద, అన్నపూర్ణ, జ్యోతి, శ్రీలత, లక్ష్మి, మహేశ్వరి, నాగలక్ష్మి, వీరస్వామి, మధుబాబు.. ఉపేందర్, సైదులు, హరికృష్ణ, విద్యా భవాని, వాణి, గాయత్రి, స్వాతి, తదితరులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును స్వీకరించరాని తెలిపారు.