Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 11 నడిగూడెం

మండలం లోని రత్నవరం గ్రామానికి చెందిన మొలుగూరి నరసింహారావు మరణం తర్వాత ఆయన కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలవాలని నిర్ణయించిన టెన్త్ క్లాస్ (2003 బ్యాచ్) స్నేహితులు తమ ఉదారతను చాటుకున్నారు. నరసింహారావు ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఒక్కొక్కరి పేరుపై రూ.50,000 చొప్పున మొత్తం రూ.1,00,000 ను పోస్టల్ డిపాజిట్ ద్వారా జమ చేసి, ఆర్థిక భరోసా కల్పించారు.సంక్షోభ సమయంలో ముందుకు వచ్చి సహాయహస్తం అందించిన స్నేహితుల ఉదారతను గ్రామస్థులు, బంధువులు, పరిచయస్తులు అభినందిస్తున్నారు. నరసింహారావు కుటుంబానికి ఇది ఒక గొప్ప ఆదరణగా నిలిచిందని వారు తెలిపారు.