Listen to this article

గుడిపల్లి మండలం కోదండపురం గ్రామానికి చెందిన పోలే ముత్యాలు మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం కోదండపురం గ్రామంలో ఇటీవల మరణించిన ముత్యాలు చిత్ర పటానికి నివాళి అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ముత్యాలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ముత్యాలు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు,తదితరులు ఉన్నారు.